Home > జాతీయం > ఉదయనిధి స్టాలిన్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

ఉదయనిధి స్టాలిన్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్కు ఈడీ ఝలక్ ఇచ్చింది. మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా ఆయన నడిపే ఫౌండేషన్‌కు చెందిన ఆస్తులను జప్తు చేసింది. ఫౌండేషన్కు సంబంధించిన రూ.36 కోట్ల విలువైన స్థిరాస్తులను, రూ.34.7 లక్షల బ్యాంక్‌ డిపాజిట్లను ఈనెల 25న అటాచ్‌ చేసినట్లు వివరించింది. ఈ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో చెప్పడంలో ట్రస్టీలు విఫలమయ్యారని ఈడీ ఆరోపించింది.

ఇక కల్లాల్‌ గ్రూప్, లైకా ప్రొడక్షన్స్, లైకా హోటల్స్‌లో సోదాలు జరిపినట్లు ఈడీ తెలిపింది. కల్లాల్ గ్రూప్ 114.37 కోట్లు మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఇక లైకా గ్రూప్ పలు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది. ఇటీవల విడుదలైన పొన్నియన్ సెల్వన్ 2 సహా రోబో 2, దర్బార్, స్పైడర్ పలు సినిమాలను లైకా సంస్థ నిర్మించింది.

Updated : 27 May 2023 8:36 PM GMT
Tags:    
Next Story
Share it
Top