లిక్కర్ స్కాంలో కవిత పేరు చేర్చిన ఈడీ! - MicTv.in - Telugu News
mictv telugu

లిక్కర్ స్కాంలో కవిత పేరు చేర్చిన ఈడీ!

November 30, 2022

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు బుధవారం అనూహ్య మలుపు తీసుకుంది. మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన అమిత్ అరోరాను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సమర్పించిన రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ రెడ్డిలు సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లను సమకూర్చారని రిపోర్టులో ప్రస్తావించింది. ఈ డబ్బును విజయ్ నాయర్ కు చేర్చినట్టు తెలిపింది.

ఈ విషయాన్ని అమిత్ అరోరా దర్యాప్తులో ఇచ్చిన వాంగ్మూలాన్ని ధ్రువీకరించారని వివరించింది. అంతేకాక ‘ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం 36 మంది 170 ఫోన్లను ధ్వంసం చేశారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు 33 ఫోన్లను, వాటిలో కవితవి 2 నెంబర్లు, 10 ఫోన్లు ఉన్నాయి. ఆధారాలు దొరక్కుండా చేసిన ఈ మొత్తం ఫోన్ల విలువ రూ. 138 కోట్ల’ని తెలిపారు.