అక్రమ లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝుళిపిస్తోంది. మనీలాండరింగ్ కేసులో ప్రముఖ సినీనటి కృతివర్మను గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తోంది. రూ. 265 కోట్ల హవాలా కేసులో ఇప్పటే పలుసార్లు విచారించిన ఈడీ బుధవారం మళ్లీ విచారించింది. నటిగా మారకముందు ఆమె ఆదాయపు పన్నుశాఖలో పనిచేయడం గమనార్హం. ఆ వృత్తిలో లోటుపాట్లను బాగా వంటబట్టించుకునే అక్రమాలకు తెరతీసినట్లు భావిస్తున్నారు. జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన కృతి తన పైస్థాయి అధికారులు లాగిన్ వివరాలు తెలుసుకని డబ్బు తరలించినట్లు అభియోగాలు మోపారు. చక్కని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వదలుకుని, డబ్బాశాతో చిక్కుల్లో పడిన కృతివర్మ రోడీస్, బిగ్ బాస్ సీజన్ 12లో కనిపించింది. చాలా డ్యాన్స్ ప్రోగ్రాముల్లో పాల్గొంది. పలు వెబ్ సిరీసుల్లోనూ నటించింది.