Home > Featured > చిక్కుల్లో చిదంబరం.. లుకౌట్ నోటీసులు జారీ

చిక్కుల్లో చిదంబరం.. లుకౌట్ నోటీసులు జారీ

ED Issue Lookout Notice

మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి చిక్కులు తప్పడంలేదు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లకుండా అన్ని ఎయిర్ పోర్టుల్లో నోటీసులు అందించారు. ఇప్పటికే ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2007 సంవత్సరంలో ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులను నిబంధనలకు విరుద్దంగా అనుమతించారని ఆరోపణలు వచ్చాయి. దీనికోసం ఆయన ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలతో ఈడీ,సీబీఐ దర్యాప్తు ప్రారంభించాయి. దీంతో ఆయన కేసు నుంచి తప్పించుకునేందుకు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయినా ప్రతిఫలం లేకపోవడంతో కనిపించకుండా వెళ్లిపోయారు. ఆయన విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని భావించిన ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది.

Updated : 21 Aug 2019 1:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top