ED issues fresh summons to Sonia Gandhi for July 21 in National Herald Case
mictv telugu

మనీ లాండరింగ్ కేసులో సోనియాగాంధీకి మరోసారి ఈడీ సమన్లు

July 11, 2022

ED issues fresh summons to Sonia Gandhi for July 21 in National Herald Case

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి సోమవారం ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. జులై 21న ఆమె దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాలని వాటిలో పేర్కొంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ ఆమెను ప్రశ్నించేందుకు సిద్ధమైంది.

వాస్తవానికి సోనియా గాంధీ జూన్ 8న ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. జూన్ 2న కొవిడ్ సోకడంతో సాధ్యం కాలేదు. దీంతో దర్యాప్తు సంస్థ జూన్ 23న హాజరుకావాలని మరోసారి సమన్లు పంపింది. అయితే అనారోగ్యం కారణంగా ఆమె హాస్పిటల్ లో చేరడంతో విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం ఆమె ఈడీకి లేఖ రాశారు. ఆ క్రమంలోనే తాజాగా కొత్త తేదీని నిర్ణయించింది. మరోపక్క రాహుల్ గాంధీ ఇదివరకే ఐదు రోజులపాటు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన్ను ఈడీ దాదాపు 50 గంటల పాటు ప్రశ్నించింది.