ED Notices: BRS MLC Kavitha clarified that will attend the hearing on the 11th March
mictv telugu

11న విచారణకు హాజరవుతా.. ఈడీకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత

March 9, 2023

ED Notices: BRS MLC Kavitha clarified that will attend the hearing on the 11th March

ఈడీ నోటీసులకు సంబంధించి, ఈ నెల 11న విచారణకు హాజరవుతానని ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాశారు. ముందస్తు అపాయింట్‌మెంట్లు, కార్యక్రమాలు ఉన్నందున ఇవాళ విచారణకు హాజరు కాలేనని తెలిపారు. కవిత విజ్ఞప్తిపై ఈడీ స్పందించాల్సి ఉంది. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్‌, బీఆర్ఎస్ను లొంగ దీసుకోవడం సాధ్యం కాదని కవిత మరో ప్రకటనలో తెలిపారు.

తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కల్వకుంట కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నాడు ఆమె ఈడి జాయింట్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ముందస్తు అపాయింట్మెంట్లు మరియు కార్యక్రమాలు ఉన్నందున 9న విచారణకు హాజరు కాలేయని తేల్చి చెప్పారు. హడావిడిగా దర్యాప్తు చేయడం ఏంటని ఈడీని కవిత నిలదీశారు. ఇంత స్వల్ప కాలంలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం ఏంటో అర్థం కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తు పేరిట రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ప్రస్తుత దర్యాప్తుతో తాను చేసేది ఏమీ లేదని తెలిపారు.

 

ఒక సామాజిక కార్యకర్తగా ఒక వారం ముందే నా కార్యక్రమాలు ఖరారయ్యాయనీ, కాబట్టి 11వ తేదీన విచారణకు హాజరవుతానని తెలియజేశారు. రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు. దేశ పౌరురాలిగా ఒక మహిళగా చట్టపరమైనటువంటి అన్ని హక్కులను తాను ఉపయోగించుకుంటానని తేల్చి చెప్పారు. గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఒక మహిళను తన నివాసంలో విచారించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. వీటన్నింటినీ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని అడిగారు.