ED notices to CM's nephew.. Leaders are worried
mictv telugu

సీఎం మేనల్లుడికి ఈడీ నోటీసులు..ఆందోళనలో నాయకులు

August 30, 2022

ED notices to CM's nephew.. Leaders are worried

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ నోటీసులు నోటీసులు జారీ చేసింది. కోల్‌కతాలో ఉన్న ఈడీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం అభిషేక్‌ బెనర్జీ విచారణకు హాజరు కావాలని డైరెక్టరేట్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ ఈడీ నోటీసులు జారీ చేయడానికి కారణం ఏంటీ? అభిషేక్‌ బెనర్జీ ఏం చేశారు? అనే విషయాలపై బెంగాల్ రాష్ట్ర ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ..”బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణం’ కేసులో మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీకి ఈరోజు సమన్లు జారీ చేశాం. విచారణ కోసం అభిషేక్‌..కోల్‌కతాలోని ఈడీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం విచారణకు హాజరు కావాలని కోరాం. మా అధికారుల ముందు హాజరుకావాలని అభిషేక్ బెనర్జీకి సమన్లు పంపాం. అయనని విచారించడానికి ఢిల్లీ నుంచి మా అధికారులు వస్తారు” అని ఆయన అన్నారు.

మరోపక్క తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అభిషేక్‌కు ఈడీ నోటీసులు పంపించడంపై తీవ్రంగా మండిపడుతూ, ధర్నాలు, రాస్తరోకోలు చేస్తున్నారు. తాజాగా సీఎం మమతా బెనర్జీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పార్టీలో రెండవ స్థానంలో ఉన్న నా మేనల్లుడు అభిషేక్‌తో పాటు, ఇతర సీనియర్ నాయకులకు కేంద్ర ఏజెన్సీలు నోటీసులు పంపవచ్చు. అదే జరిగితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.” అని ఆమె అన్నారు.