ED raids.. Vivo directors fled China through Nepal
mictv telugu

ఈడీ దాడులు.. నేపాల్ మీదుగా చైనా పారిపోయిన వివో డైరెక్టర్లు

July 7, 2022

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో మీద ఈడీ మంగళవారం నాడు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఫోన్ల అమ్మకాల ద్వారా భారీగా సంపాదించిన ఈ కంపెనీ.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను మాత్రం ఎగ్గొట్టింది. దీంతో అనుమానం వచ్చిన ఈడీ సంస్థ కార్యాలయంపై ఏక కాలంలో దాడులు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. దీంతో దొరికిపోయామన్న భావనతో ఇద్దరు డైరెక్టర్లు జాంగ్ చెన్‌హూ, జాంగ్జీలు పారిపోయారు. అయితే విమానంలో వెళితే పట్టుబడతామనే ఉద్దేశంతో రోడ్డు మార్గం ద్వారా నేపాల్ వెళ్లి ఆ తర్వాత చైనాకు చేరుకున్నారు. అటు వివో కంపెనీని మన దేశంలో రిజిస్టర్ చేసినప్పుడు కూడా నకిలీ డాక్యుమెంట్లు సమర్పించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో డైరెక్టర్లు పారిపోవడం సంచలనంగా మారింది.