ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ జోయ్ అలుక్కాస్ జ్యుయెలరీపై ఈడీ బుధవారం రైడ్ చేసింది. జోయ్ వర్గీస్ అలుక్కాస్ ఇల్లు, కార్పొరేట్ ఆఫీసులో సోదాలు నిర్వహించింది. 25 ఎకరాల్లో నిర్మించే ప్రాజెక్టు కోసం విదేశాలకు రూ. 300 కోట్లు నిధులను హవాలా రూపంలో మళ్లించారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరగడం గమనార్హం. అటు విక్రయాల పరంగా రెండో స్థానంలో ఉన్న జోయ అలుక్కాస్ సంస్థ ఐపీఓ ద్వారా రూ. 2 వేల 300 కోట్లను సమీకరించాలని సెబీకి తెలియజేసింది. అయితే ఈడీ రైడ్స్‌కి ఒక రోజు ముందు దాన్ని ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2018లో కూడా సంస్థ ఐపీఓకి వెళ్లి తర్వాత రద్దు చేసుకుంది. అటు సంస్థకు దేశవ్యాప్తంగా 68 శాఖలు ఉన్నాయి.