ఆమ్వేకు ఈడీ షాక్.. రూ. 757 కోట్ల ఆస్తి జప్తు - MicTv.in - Telugu News
mictv telugu

ఆమ్వేకు ఈడీ షాక్.. రూ. 757 కోట్ల ఆస్తి జప్తు

April 18, 2022

 avi

గొలుసుకట్టు వ్యాపారం చేసే ఆమ్వే సంస్థకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. సోమవారం సంస్థకు చెందిన రూ. 757 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. వ్యాపారం చేసే క్రమంలో జరిగిన అనేక మోసాలకు ఆమ్వేపై పలు కేసులు నమోదయ్యాయి. వాటిలో ఈడీ కేసు కూడా ఉంది. ఈ క్రమంలో సంస్థకు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించిన ఈడీ వాటిని కోర్టుకు సమర్పించింది. కోర్టు ఆదేశాలతో తాజా చర్యకు ఈడీ ఉపక్రమించింది. సీజ్ చేసిన వాటిలో కంపెనీకి చెందిన తమిళనాడులోని పరిశ్రమ భవనం, యంత్రాలు, రూ. 411.83 కోట్ల స్థిర, చరాస్తులు, 36 బ్యాంకు ఖాతాల్లోని రూ. 345.94 కోట్ల నగదు వంటివి ఉన్నాయి.