ED seized Xiaomi's Rs. 5 thousand crore cash
mictv telugu

చైనా కంపెనీ షావోమీకి ఈడీ భారీ షాక్.. ‘ఫెమా’ కింద కఠిన చర్యలు

September 30, 2022

ED seized Xiaomi's Rs. 5 thousand crore cash

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమీకి ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన రూ. 5,551 కోట్ల నగదును సీజ్ చేసింది. ఇంత పెద్ద మొత్తం సీజ్ చేయడం ఈడీ చరిత్రలోనే తొలిసారి.

ఆ సంస్థ ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించి విదేశాలకు అక్రమంగా డబ్బు తరలించినట్టు తేలడంతో ఈ చర్య తీసుకున్నట్టు ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. కేంద్రానికి చెల్లించాల్సిన రాయల్టీ డబ్బును చెల్లించకుండా విదేశాలకు డబ్బు తరలించారని షావోమీపై ప్రధాన అభియోగం. అటు రియల్ మీ, వివో వంటి కంపెనీలపై కూడా గతంలో ఈడీ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన కొందరు డైరెక్టర్లు దేశం విడిచి పారిపోయారు. కొందరిని పట్టుకోగా, రోడ్డు మార్గం ద్వారా నేపాల్ వెళ్లి పారిపోదామనుకున్న ఓ చైనీస్ డైరెక్టరుని బీహార్‌లో పట్టుకున్నారు. దీంతో ఆందోళన చెందిన చైనా.. తమ డైరెక్టర్లకు తగిన న్యాయ సహాయం అందించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు సీజ్ చేయడంతో చైనా రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.