ED seizes jewels, bank deposits worth rs.253 cr of Nirav Modi's firms in Hong Kong
mictv telugu

హాంకాంగ్‌లోని నీర‌వ్ మోదీ ఆస్తుల‌ను సీజ్ చేసిన ఈడీ

July 22, 2022

ED seizes jewels, bank deposits worth rs.253 cr of Nirav Modi's firms in Hong Kong

భార‌త బ్యాంకుల‌ను మోసం చేసి ఫారెన్‌లో త‌ల‌దాచుకున్న నీరవ్ మోదీ ఆస్తుల‌ను ఈడీ సీజ్ చేసింది. బ్యాంకుల‌కు వేలాది కోట్ల రుణాల‌ను ఎగ‌వేసి ఫారెన్‌కు పారిపోయిన వ‌జ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) శుక్ర‌వారం మ‌రో అడుగు ముందుకేసింది. హాంగ్‌కాంగ్‌లోని మోదీకి చెందిన కంపెనీల‌కు చెందిన ఆస్తుల‌ను అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా సీజ్ చేసిన ఆస్తుల్లో మొత్తం రూ.253.62 కోట్ల విలువ చేసే ప‌లు అభ‌ర‌ణాల‌తో పాటు కంపెనీ బ్యాంకు ఖాతాల్లోని న‌గ‌దు నిల్వ‌లున్నాయి.

లేటెస్ట్‌గా సీజ్ చేసిన ఆస్తుల‌తో క‌లిపి ఇప్ప‌టిదాకా నీర‌వ్ మోదీకి చెందిన రూ.2,650.07 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుల‌కు దాదాపుగా రూ.28 వేల కోట్ల పైచిలుకు రుణాల‌ను ఎగ‌వేసిన నీర‌వ్ మోదీ.. 2018లో దేశం వ‌దిలి ప‌రారయ్యాడు. తొలుత అమెరికా, ఆ త‌ర్వాత ఇంగ్లండ్ చేరిన మోదీని ఈ మ‌ధ్య‌నే బ్రిట‌న్ పోలీసులు అరెస్ట్ చేశారు.