ED served notice to MLC Kavitha in liquor scam
mictv telugu

కల్వకుంట్ల కవితకు ఈడీ షాక్.. లిక్కర్ స్కాంలో నోటీసులు జారీ

September 16, 2022

ఢిల్లీలో సంచలనం రేపిన లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాలకు పాకింది. ఈ కుంభకోణంలో ఈడీ ఇప్పటికే రెండు సార్లు సోదాలు నిర్వహించగా, తాజాగా శుక్రవారం పలు చోట్ల భారీ ఎత్తున మూడోసారి సోదాలు నిర్వహించింది. ఈ సారి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పర్సనల్ ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లో సోదాలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె కరోనాతో బాధపడుతూ క్వారంటైన్‌లో ఉండడంతో ఆమె సహాయ సిబ్బందికి నోటీసులు అందజేశారు. అటు ఈ స్కాంకు సంబంధించి మొత్తం 43 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. నెల్లూరులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసంలో, ఢిల్లీలోని ఆయన బంగ్లాలో, హైదరాబాద్ ఇందిరా పార్క్ చౌరస్తాలోని శ్రీసాయి కృష్ణ రెసిడెన్సీలో, రాయదుర్గంలోని జయభేరి సౌత్ బ్లాక్‌లో తనిఖీలు నిర్వహించారు. అంతేకాక, ఈ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సత్యేంద్ర జైన్‌ను విచారించేందుకు ఈడీ అధికారులు వెళ్లారు. కాగా, ఇంతకుముందు కవిత తనపై ఈ అంశంలో ఆరోపణలు చేయకుండా కోర్టు నుంచి ఆదేశాలు పొందిన విషయం తెలిసిందే.