నా తీరుతో ఈడీ షాకైంది : రాహుల్ గాంధీ - MicTv.in - Telugu News
mictv telugu

నా తీరుతో ఈడీ షాకైంది : రాహుల్ గాంధీ

June 23, 2022

గంటల సేపు ప్రశ్నించినా ఎలాంటి అలుపు లేకుండా కుర్చీలో కూర్చున్న తన ఓపిక, సహనం చూసి ఈడీ అధికారులు షాకయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం కొన్నిరోజులుగా ఈడీ రాహుల్ గాంధీని విచారించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు సంఘీభావం తెలపడానికి వచ్చిన నేతలతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ‘గంటల కొద్దీ విచారిస్తున్నప్పుడు అలుపు, అసహనం లేకుండా ఒంటరిగా ఎలా కూర్చున్నారంటూ ఈడీ అధికారులు నన్ను ప్రశ్నించారు. విపాసన ధ్యాన ప్రక్రియ సాధన చేయడం వల్ల అంత ఓపిక వచ్చిందని సరదాగా చెప్పా. కానీ, చిన్న గదిలో ముగ్గురు ఈడీ అధికారులు ఉండడం వల్ల ఒంటరిగా ఉన్నానని అనిపించలేదు. కాంగ్రెస్ కోసం 2004 నుంచి పనిచేస్తుండడం వల్ల పై లక్షణాలు అలవడ్డాయి. ఐదు రోజులూ వారి ప్రశ్నలను ఎదుర్కొని సమాధానాలిచ్చాన’ని పేర్కొన్నారు.