Education Minister Sabitha sought Governor Tamilisai's appointment
mictv telugu

గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరాం.. సందేహాలు నివృత్తి చేస్తాం : మంత్రి సబిత

November 9, 2022

Education Minister Sabitha sought Governor Tamilisai's appointment

యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్ తమిళిసై వెలిబుచ్చిన సందేహాలను నివృత్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అపాయింట్ మెంట్ కోరామని, సమయం ఇస్తే న్యాయపరమైన అంశాలను గవర్నర్‌‌కు వివరిస్తామని వెల్లడించారు. ఈ అంశంపై గవర్నర్ కార్యాలయం పంపిన లేఖ అందిందని, గవర్నర్‌‌‌ని కలవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు.

అంతకు ముందు ఈ బిల్లుపై తమిళిసై యూజీసీతో పాటు ప్రభుత్వానికి లేఖ రాశారు. బిల్లు వల్ల న్యాయపరమైన సమస్యలతో పాటు నియామకాలు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయనే సందేహాలను ఆమె లేవనెత్తారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వమని రెండు పార్టీలను కోరారు. ఈ నేపథ్యంలో మంత్రి సబిత స్పందించడతో వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అటు నిజాం కాలేజీ వివాదంపై కూడా మంత్రి స్పందించారు. హాస్టల్ అంశంపై ఓయూ వీసీ, నిజాం కాలేజీ ప్రిన్సిపల్‌‌తో మాట్లాడుతున్నామని, అమ్మాయిలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.