Educational institutions will reopen in Telangana from today
mictv telugu

తెలంగాణలో నేటి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం

July 18, 2022

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయని విద్యాశాఖ అధికారులు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతవారంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసిన కారణంగా మంగళవారం నుంచి శనివారం వరకు ఐదు రోజులపాటు అన్నీ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు, వరదలు తగ్గుముఖ పట్టడంతో ఈరోజు నుంచి మళ్లీ బడులను షురూ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కావున విద్యార్థినీ, విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఇవాళ్టి నుంచి తరగతులకు హాజరుకావాలని సూచించారు.

మరోపక్క రాష్ట్రంలో గతవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను ఆయా విశ్వవిద్యాలయాల రిజిస్ట్రర్లు వాయిదా వేసిన తెలిసిందే. వర్షాలు తగ్గడంతో అధికారులు మళ్లీ పరీక్షలను కొత్త తేదీలను నిర్ణయించి, పరీక్షలను నిర్వహించడానికి సిద్దమైయ్యారు. ఈ క్రమంలో విద్యాసంస్థలకు సంబంధించిన ఈ తాజా సమాచారాన్ని అధికారులు విద్యార్థులకు సోమవారం తెలియజేశారు.