హిందీ భాషపై ‘ఈగ’ విలన్ సంచలన వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

హిందీ భాషపై ‘ఈగ’ విలన్ సంచలన వ్యాఖ్యలు

April 25, 2022

కన్నడ స్టార్ హీరో, ఈగ సినిమా విలన్ కిచ్చ సుదీప్ హిందీ భాష‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు అని, బాలీవుడ్‌ ఎన్నో పాన్‌ ఇండియా సినిమాలను నిర్మిస్తోందని అన్నాడు. తాజాగా ఆయ‌న ఓ స‌మావేశంలో మాట్లాడుతూ..”కేజీఎఫ్‌ 2 సినిమా అద్భుత విజయం సాధించింది. కన్నడ సినిమాను ప్రశాంత్ నీల్ పాన్ ఇండియాగా తెరకెక్కించాడు. మన సౌత్ సినిమాల‌ను (తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం) డబ్ చేసేందుకు బాలీవుడ్ ప్ర‌ముఖులు ఎంతో కష్టపడుతున్నారు. బాలీవుడ్ సినిమాలు అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తుంది” అని అన్నాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. మరోపక్క సుదీప్ తెలుగులో ఈగ, బాహుబలి, సైరా వంటి సినిమాల్లో న‌టించి, తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా విక్రాంత్ రోణ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌పై,హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.