బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన వరంగల్ అమ్మాయి - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన వరంగల్ అమ్మాయి

January 21, 2020

rbh

‘అంతకుముందు ఆ తర్వాత’ సినిమాతో 2013లో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరంగల్ అమ్మాయి ఈషా రెబ్బ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ వస్తోంది. ఇటీవల విడుదలైన ‘రాగల 24గంటల్లో’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది.

తాజాగా ఈ తెలుగుగమ్మాయి బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న ఈషా.. ఇప్పుడు సత్తా చాటేందుకు హిందీ సినిమాల్లో అడుగుపెట్టనుంది. మహిళా సాధికారత నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ఈషా రాజస్థానీ అమ్మాయి పాత్రలో పోషించనుందట. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తనయుడు హర్షవర్దన్ కపూర్ సరసన అమె కనిపించనుందని సమాచారం. నేషనల్ అవార్డు విన్నర్ రాజ్ సింగ్ చౌదరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తెలుగులో ఈషా రెబ్బా నటన చూసిన బాలీవుడ్ నిర్మాత ఒకరు.. ఆమెను ఆడిషన్‌కు పిలిచి వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే సినిమా చిత్రీకరణ పనులు ప్రారంభం కానున్నాయి.