పదవే పరమావధి,అధికారమే ధ్యేయంగా బ్రతికే పార్టీ కాంగ్రెస్..! - MicTv.in - Telugu News
mictv telugu

పదవే పరమావధి,అధికారమే ధ్యేయంగా బ్రతికే పార్టీ కాంగ్రెస్..!

August 3, 2017

తెలంగాణ రాష్ట్రం ఏ పార్టీ దయా దాక్షన్యాల మీద రాలేదని ఆర్ధిక మంత్రి ఈటెల రాజెందర్ అన్నారు.బరిగీసి కొట్లాడినం బలిదానాలు చేసినం,రక్తం చిందించి రాష్ట్రం సాధించుకున్నామన్నారు.సాధించిన పెట్టిన పార్టీకీ ఉద్యమ సారథికి ప్రజలు పట్టం కట్టారు.రాష్ట్రాన్ని బాగుచేసే బాధ్యతను అప్పగించారు.తెలంగాణ ఉద్యమంలో జంకకుండా,వెరవకుండా .అవమానాలను ,దిగమింగుతూ కమిట్మెంట్ తో రాష్ట్రాన్ని సాధించినం.ఇప్పుడు ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేదందుకు అంతే బాధ్యతతో రాష్ట్రం గొప్పగా ఎదగాలని పని చేస్తున్నాం.దేశంలోనే ఆదర్శంగా నిలవాలని ఆలోచనలతో ముందుకు సాగుతున్నాం.ఎక్కడ కూడా వేలెత్తి చూపి పనిలేకుండా మూడు సంవత్సరాల పాలనలో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నం.

కేంద్ర ప్రభుత్వమే కాదు ,దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయి.తెలంగాణ రాష్ట్రానికి ఓక దశ దిశ ఉందని,ఒక కమిట్మెంట్ ఉందని మెచ్చుకుంటున్నారు.ఇవన్నీ చూసి ఓర్వలేని మీరు సియంగారి వేగాన్ని కాళ్లల్లో కట్టెలుపెట్టి ఆపే ప్రయత్నం చేస్తున్నారు.మాపాలన దక్షతను జీర్ణీంచుకోలేని పార్టీ మీది.పదవే పరమావది,అధికారమే ధ్యేయంగా బతికే పార్టీ కాంగ్రెస్.తెలంగాణాను ముందుకు తీసుకపోదామని మేం చేస్తుంటే,అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు.మీరు ఏం చేసినా మా కార్య దీక్షను,మా కమిట్మెంటును ఆపలేరు.

నిరాశా నిసృహతో ప్రతీ చిన్న చిన్న విషయానికి బురదజల్లే ప్రయత్నంచేసే మీరే అబాసుపాలవుతున్నారు అని మర్చిపోకండి.ఒకడే అడుగుతున్నా 2004 జలయజ్ఝం పేరుతో ప్రాజెక్టులు మొదలు పెట్టిన మీరు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు.400 కోట్ల అంచనా తో  రెండేళ్లో పూర్తి చేస్తామని  మొదలు పెట్టిన మిడ్ మానేరును పది సంవత్సరాలలో కూడా పూర్తి చేయకుండా రైతుల కళ్లల్లో మట్టి కొట్టిన పార్టీ కాంగ్రెస్.కానీ మేము మాత్రం నిర్ధేశిత ప్రణాళికతో పనులు పూర్తి చేస్తున్నాం.కాంగ్రెస్ ప్రభుత్వంచేసిన  కాలయాపన వల్ల 16000 కోట్లతో ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల అంచనాలు 35000 కోట్లకు చేరుకున్నాయి.అలాంటి పద్దతులకు తెలంగాణ ప్రభుత్వం పాతరేసింది.అనుకున్న లక్ష్యాలతో ముందుకుపోతున్నం.మీ మాటలు విని ప్రజలు చీ కొడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ దేశాన్ని పాలించింది మేమే అనే అహంకారంతో ఉంటారు కానీ మీ ఏలిన 45 ఏండ్లు ప్రజల కనీస అవసరాలు తీర్చలేక చతికిల పడ్డారు.కానీ మేము అనుభవంలేకుండా శభాష్ అనిపించుకుంటున్నాం.3 ఏండ్లలో 200 సమస్యలను పరిష్కరించాం.ప్రతీ ఎన్నికలలో ప్రజల విశ్వాసం పొందాం.మీరు మాకు మద్దతు ఇవ్వకున్నా పర్లేదు.కానీ అడ్డుకునే కుసంస్కారం మంచిది కాదు.1000 రూపాల పించన్ ఇస్తాం అన్నప్పడు డబ్బులు ఎక్కడివి అన్నారు కానీ  మేం ఇచ్చి చూపిస్తున్నాం.ఆడపిల్లల పెండ్లికి 51000 ఏడనుంచి తెస్తారు అని మీరు లెక్కలు వేసుకుంటే దాన్ని 75116 లకు పెంచిన సియం మా కేసీఆర్ గారు.సన్నబియ్యం ఇస్తున్నాం.మీ హయాంలో ఒక్క రెసిడెస్సియల్ స్కూల్ దిక్కులేకపోతే మా ప్రభుత్వంలో 504 రెసిడెన్సియల్ స్కూళ్లని ఒకేసారి మొదలు పెట్టినం..మీరోజుల్లో పవర్ లేక పంటలెండిపోతే ఈరోజు 24 గంటలు పవర్ ఇస్తున్నాం.

టిఆర్ ఎస్ కు ఉద్యమాలు తెలుసు,నినాదాలు తెలుసు, కానీ పరిపాలన ఏం తెలుసు అని చిన్న చూపు చూసారు,కానీ ఉద్యమ పరిపాలన తెలుసు అని నిరూపించినం.కొత్తే అయినా ఎన్ని అడ్డకులనైనా అధిగమిస్తూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని గొప్పగా నిలుపుతున్నాడు మా కేసీఆర్.ప్రజల కోణంలో ప్రజల విశ్వాసంతో ప్రభుత్వాన్ని నడపడం మేం సాధించిన గొప్ప విషయం.మాకు నైపుణ్యంలేదని మీరు అనుకుంటున్నారు నిజమే..మాకు మీలాగా భూ అక్రమాలు చేసే నైపుణ్యంలేదు,కుర్చీలు కూలగొట్టే నైపుణ్యంలేదు,పదవే పరమావధిగా బతికే నైపుణ్యంలేదు.

మాకు 4 ఆశయాలున్నాయి

ఆకలి కేకలు,ఆత్మహత్యలు లేని ఆకుపచ్చతెలంగాణ

ప్రజల విశ్వాసం పెంచుకోవడం

కనీస వేతనాలు లేకుండా వెట్టి చాకిరీ చేస్తున్న వారికి ఆర్ధిక స్వాలంబన తీసుకురావడం.

అవినీతి లేని బంగారు తెలంగాణ తయారు చేయండం,

కాంగ్రెస్ వాలకం,విధానాలు దేశమంతా తెలుసు…అందరూ చీకొడుతున్నా, పదవి వస్తుందన్నా,దింపుడు కళ్లంఆశతో మీరు ఉన్నారు.తెలంగాణలో ఇప్పటికే ఒకపార్టీ గల్లంతయ్యింది,మిగిలిన వారికి కూడా అదే పరిస్ధితి ,చిన్న నాయకులు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అంటే ఓకే కానీ ,అనుభవమున్న బడా నాయకులు కూడా విమర్శిస్తే ఎలా?ఇది మీ వయసుకు.అనుభవంకు తగదు,ప్రజలు మెచ్చుకోరు. అని కాంగ్రెస్ ను ఉద్దేశించి ఈటెల రాజెందర్ అన్నారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కడుపుమంటతోనే కేసీఆర్ గారు మాట్లాడారు అని అన్నారు,168 కేసులు కాంగ్రెస్ నాయకులు పెట్టినవే అన్నారు.కెకె మహెందర్ రెడ్డి ,రచనా రెడ్డి మీ నేతులు కాదా?అని కాంగ్రెస్ ను ప్రశ్నించారు.కొండా పోచమ్మ ప్రాజెక్ట్ కి  4630 ఎకరాలు సేకరించాల్సివుంటే ..ఆరుగురు కాంగ్రెస్ నేతుల కోర్డుకు వెళ్లి అడ్డున్నారని విమర్శించారు.కేటీ ఆర్ ను విమర్శించిన షబ్బీర్ ఆలీ పై తీవ్రంగా మండిపడ్డారు.హిమాన్షు మోటార్సులో 2007 నుండి ఎలాంటి లావాదేవీలు జరగడంలేవని స్పష్టం చేసారు.విహెచ్ తో సహా నేతలందరూ ప్రతి చిన్నవిషయానికి రాజకీయ రంగు పులుముతున్నారని,ఇది శవాలమీద పైసలు ఏరుకోవడమే నని,ఇది శవాల మీద పేలాలు ఏరుకోవడమేనని అన్నారు.దమ్ము ధైర్యం ఉంటే  వాస్తవ ఆధారాలతో రండి,ఈవేదికమీదైనా చర్చకు సిద్దమని సవాలు విసిరారు.

TRSLP కార్యాలయంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆర్ధిక పౌర సరఫరాల శాఖామంత్రి ఈటెల రాజెందర్ తో పాటు శాసన మండలి సభ్యులు పాతూరి సుధాకర్ రెడ్డి ,భాను ప్రసాద్,పల్ల రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.