వడ్డీరేట్ల ఎఫెక్ట్.. రుణ గ్రహీతలకు బిగ్ షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

వడ్డీరేట్ల ఎఫెక్ట్.. రుణ గ్రహీతలకు బిగ్ షాక్

June 8, 2022

భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) నేడు రెపో రేటును (వడ్డీరేట్లు) పెంచుతూ, ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో రుణ గ్రహీతలకు గట్టి షాక్ తగిలింది. కానీ, ఫిక్స్ డ్ డిపాజిటర్లకు ఒక శాతం వరకు అదనపు రాబడి పెరిగింది.

నేడు ఆర్బీఐ పెంచిన రెపో రేటు వల్ల రుణ గ్రహీతలకు షాక్ తగిలింది. రూ. 30 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి 7 శాతం వడ్డీ రేటుపై తీసుకుంటే, తాజా పెంపుతో ఈఎంఐ రూ.1,648కి చేరుతుంది. అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ.23,259 నుంచి రూ.24,907గా అవుతుంది.

ఇక, వాహన రుణం రూ. 8 లక్షలను 7 ఏళ్ల కాలానికి 10 శాతం రేటుపై తీసుకుంటే.. నెల రోజుల్లో 0.90 శాతం పెరగడం వల్ల ఈఎంఐ రూ.375 పెరుగుతుంది. తర్వాత వ్యక్తిగత రుణం.. రూ.5 లక్షలు 5 ఏళ్ల కాలానికి తీసుకుంటే, వడ్డీ రేటు 14 శాతం నుంచి 14.9 శాతం పెరిగి ఈఎంఐ రూ.235 మేర పెరుగుతుంది. ఇక, ఫిక్స్ డ్ డిపాజిర్ల విషయానికొస్తే, ఆర్బీఐ తాజా పెంపుతో డిపాజిట్లపైనా ఒక శాతం వరకు అదనపు రాబడికి అవకాశం ఏర్పడింది.

రేపో రేటు అంటే.. ‘వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే రేటునే రెపో రేటుగా చెబుతారు. ఈ రేటుకు బ్యాంకులు తమ మార్జిన్, రిస్క్ కలుపుకుని రుణాలపై రేట్లను ప్రకటిస్తుంటాయి. ఆర్బీఐ రెపో రేటును పెంచినప్పుడల్లా బ్యాంకులు గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై రేట్లను సవరిస్తుంటాయి. దీంతో ఈఎంఐ పెరగడం లేదంటే రుణ కాలవ్యవధి పెరగడం జరుగుతుంది.’