కోడిగుడ్డు..హెల్త్‌కి వెరీ గుడ్డు - MicTv.in - Telugu News
mictv telugu

కోడిగుడ్డు..హెల్త్‌కి వెరీ గుడ్డు

May 31, 2022

కోడిగుడ్డు తినడం మంచిదేనా?, ఎక్కువగా తింటే ఏమైనా హానికరమా?, కోడిగుడ్డు తినటం హెల్త్‌కి మంచిదేనా? ఈ కోడిగుడ్డు వల్ల ఉపయోగం ఏంటీ? అని పలు రకాల అనుమానాలు ఉన్నవారికి నిపుణులు ఓ శుభవార్త చెప్పారు. కోడిగుడ్డు తింటే హెల్త్‌కి చాలా మంచిదని, కోడిగుడ్డులో కొలెస్ట్రాల్‌తోపాటు ఇతర పోషకాలు కూడా తగినన్ని ఉంటాయని నిపుణులు పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు.

ఇటీవలే కోడిగుడ్లపై నిర్వహించిన ఓ అధ్యయనంలో.. గుడ్లను మోస్తరుగా తీసుకోవడం వల్ల గుండెకు మంచి చేసే మెటాబాలిటీలను పెంచుతుందని నిపుణులు తెలిపారు. ఈ అధ్యయానికి సంబంధించి ‘ఈ లైఫ్’అనే జర్నల్ అనే పత్రిక .. ‘చైనాలో 5 లక్షల మందిపై చేసిన అధ్యయనంలో రోజువారీగా గుడ్లు తినేవారికి, తినని వారితో పోలిస్తే గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ తక్కువగా ఉన్నాయి. చైనాలో 4,778 మందిని ఎంపిక చేసి వారిపై తాజా అధ్యయనం నిర్వహించారు. అందులో 3,401 మందికి గుండె జబ్బులు ఉన్నాయి. మిగిలిన 1,377 మంది ఆరోగ్యవంతులు. వారి ప్లాస్మా శాంపిల్స్‌లో 225 మెటాబాలిటీలను అంచనా వేశారు. గుడ్లు తిన్న వారిలో 24 మెటాబాలిటీలను’ అధికారులు గుర్తించినట్లు వివరాలు వెల్లడించింది.

‘వ్యక్తులు ఎవరైతే మోస్తరుగా కోడిగుడ్లను తీసుకుంటున్నారో, వారి రక్తంలో అపోలిపో ప్రొటీన్ ఏ1 ఎక్కువ పరిమాణంలో ఉంటోంది. మంచి కొలెస్ట్రాల్ అని చెప్పుకునే హైడెన్సిటీ లిపో ప్రొటీన్ నిర్మాణానికి అపోలిపో ప్రొటీన్ ఏ1 కీలకమౌతోంది. దీన్నే మంచి లిపో ప్రొటీన్ అని కూడా చెబుతాం. కనుక మోస్తరుగా గుడ్లు తినే వారిలో హెచ్‌డీఎల్ మాలిక్యూల్స్ మరింతగా ఉంటున్నాయి. ఇవి రక్తనాళాల్లో ఉన్న అధిక కొలెస్ట్రాల్‌ను బయటకు పంపిస్తుంటాయి. రక్త ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడి గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. గుడ్లు తక్కువగా తినే వారిలో మంచిదైన అపోలిపో ప్రొటీన్ ఏ1 తక్కువగా ఉండి, గుండెకు హానిచేసే మెటాబాలిటీలే ఎక్కువగా ఉన్నట్లు’ పరిశోధకులు తెలిపారు.