వంకాయలపై ఫేస్‌బుక్ నిషేధం - MicTv.in - Telugu News
mictv telugu

వంకాయలపై ఫేస్‌బుక్ నిషేధం

October 30, 2019

Eggplant .

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన యూజర్లకు నిబంధనలను కఠినతరం చేస్తోంది. తమ వేదికను దుర్వినియోగం చేయకుండా కఠిన ఆంక్షలు విధిస్తోంది. శృంగార సంబంధ చిత్రాలపై తాజాగా వేటు వేసింది. వీటి ద్వారా అసభ్యతను, అశ్లీలాన్ని ప్రచారం చేసే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌లో ఇప్పటికే అశ్లీల కంటెంట్ పై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని చిత్రాలు, ఎమోజీలు, క్లిప్ ఆర్ట్‌కు కూడా వర్తింపజేస్తున్నారు. 

శృంగారానికి, జననాంగాలకు ప్రతీకగా కొందరు వంకాయలు, పీచ్ పళ్లు తదితర చిత్రాలను పోస్ట్ చేస్తుంటారు. ఇకపై అలాంటి చిత్రాలను పోస్ట్ చేయడం కుదరదు. అలాగే నగ్న, అర్ధనగ్న చిత్రాలను కూడా పోస్ట్ చేయకూడదు. శృంగారాన్ని రెచ్చగొట్టే కామసూత్ర, తాంత్రిక్ సెక్స్ వంటి చిత్రాలన్నిటిపైని నిషేధం ఉంటుందట. ఫేస్ బుక్ అనుబంధ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వీటిపై నిషేధం పెట్టారు. దీన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇది హాస్యాస్పద నిర్ణయం అని, కూరగాయలు ఎలా నేరాలను ప్రోత్సాహిస్తాయని అంటున్నారు.