నవ్వొద్దు.. గుడ్ల పెంకులు కూడా పౌష్టికాహారమే, ఇలా తినేయాలి..   - MicTv.in - Telugu News
mictv telugu

నవ్వొద్దు.. గుడ్ల పెంకులు కూడా పౌష్టికాహారమే, ఇలా తినేయాలి..  

December 19, 2019

Eggshell

కోడి గుడ్డు ఎంత పోషకాహారమో అందరికి తెలుసు. అయితే వాటిని వాడిన తర్వాత చాలా మంది పెంకులను చెత్త బుట్టలో పడేస్తుంటారు. దీన్ని ఓ పనికి రాని పదార్థంగా చాలా మంది భావిస్తారు. కొంత మంది మాత్రం కోడి గుడ్ల పెంకులను చెట్లకు వేయడమో, లేకపోతే బల్లులను భయపెట్టడానికి కడ్డీలకు గుచ్చి గోడలకు తగిలించడమో  చూస్తాం. కానీ ఇవి మాత్రమే కాదు వీటి ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. కేవలం గుడ్డు సొనలోనే కాదు దాని పెంకులోనూ ఎన్నో పోషక విలువలు ఉన్నట్టు తాజా అధ్యయనాలు తేల్చాయి. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నట్టు వెల్లడైంది. మామూలు పదార్థాలలో కన్నా గుడ్డు పెంకులోనే కాల్షియం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఒక గుడ్డు పెంకులో వెయ్యి నుంచి పదిహేను వందల మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుందని పేర్కొన్నారు. వీటి ద్వారా ఏఏ లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

పెంకుల్లో ఉన్న పోషకాలు ఇవే : 

  • పెంకులను పొడిచేసి నీటితో కలిపి తీసుకుంటే వీటిలో ఉండే కాల్షియం ద్వారా దంతాలు, ఎముకల గట్టితనానికి ఉపయోగపడుతుంది. అయితే చాలా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలి. 
  •  చిన్నపిల్లల్లో ఉన్న దంతక్షయం నివారించడానికి తోడ్పడుతుంది. 
  • పెంకుల పౌడర్‌ను గుడ్డులో కలుపుకొని పేస్‌ప్యాక్‌లా వేసుకుంటే చర్మం పొడిగా ఉంటుంది.
  • బట్టల మొండి మరకలూ పోగొట్టేందుకు ఉపయోగపడతాయి. ఈ పొడిని నీటిలో వేసి రాత్రంతా బట్టలను నానబెట్టి ఉతికితే ఫలితం కనిపిస్తుంది. 
  • పెంకుల వల్ల కూరగాయలు, పండ్ల వద్దకు పురుగులు దరిచేరకుండా ఉంటాయి. 
  • గార పట్టిన పళ్లు తెల్లగా మారాలంటే ఈ పొడితో బ్రెష్ చేసుకోవాలి. 
  • మొక్కల ఎదుగుదలకు వీటి పొడిని మట్టిలో కలిపితే మంచి ఫలితం కనిపిస్తుంది. 
  • వంటింట్లో నూనె పదార్థాల మరకలు పోవాలంటే పెంకుల పొడిని వెనికగర్‌తో కలిపి పీచుతో రుద్దితో ఫలితం ఉంటుంది. 
  • ఇంటి బయట లోపల పెట్టుకుంటే క్రిమి కీటకాలు దరిచేరకుండా ఉంటాయి. 
  • Eggshells on wooden table ; Shutterstock ID 1045916950