నేనెవరితో చెయ్యడానికైనా రెడీ ! - MicTv.in - Telugu News
mictv telugu

నేనెవరితో చెయ్యడానికైనా రెడీ !

June 21, 2017

తెలుగు సినిమాల్లో ‘ ఇగో ’ లేని ఒకే ఒక్క హీరో వెంకటేషే అని చెప్పుకోవచ్చు. . ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్, పవన్ కళ్యాన్ ల సినిమాలో వెంకీ అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఇంతకు ముందు పవన్, వెంకీ కలిసి ‘ గోపాలా గోపాలా ’ అనే సినిమాలో నటించి మెప్పించారు. ఇప్పుడు మళ్ళీ ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుందన్నమాట. మన తెలుగులో హీరోలు లేని ఇగోలకు పోయి, తమ స్టార్ స్టేటస్ ను కాపాడుకోవాలనే ఖుజ్లీలో మల్టీ స్టారర్ సినిమాలు చెయ్యరు. అదే హిందీలో అయితే ఎప్పటినుండో మల్టీ స్టారర్ సినిమాలు వస్తున్నాయి. అప్పడెప్పుడో పాత సినిమాల్లో కాంతారావు, రామారావు, శోభన్ బాబుల కాలంలోనే విరివిగా వచ్చాయి మల్టీ స్టారర్ సినిమాలు. ఆ తర్వాత బ్రేక్ పడ్డాయి.

ఇప్పుడా మరుగున పడ్డ కల్చర్ కోసం స్టార్ డమ్ ను పక్కకు పెట్టి చిన్న చిన్న హీరోల సినిమాల్లో సైతం అతిథి పాత్ర అయినా సరే ష్యూర్ గా చేసేది ప్యూర్ వెంకీయే ! ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’ వంటి సినిమాలో తన కన్నా జూనియర్ హీరో అయిన మహేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేస్కున్న షేర్ఖాన్ వ్యక్తిత్వం గలవాడు వెంకటేష్. అట్లనే ‘ రామ్ ’ తో మసాలా సినిమాలో ఆక్ట్ చేసిండు. ‘ ప్రేమమ్ ’ సినిమాలో మేనల్లుడైన నాగచైతన్యతో కూడా కలిసి నటించి హీరోలందరు ఇగో ఛోడో.. జాగో.. మిల్కే చలో..  ఎవరితో చెయ్యడానికైనా రెడీ అని కొత్త లెసన్ చెప్తున్నాడు.