కరోనా ఆస్పత్రిలో మంటలు .. ఏడుగురు రోగులు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఆస్పత్రిలో మంటలు .. ఏడుగురు రోగులు మృతి

June 30, 2020

cgn

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఏడుగురు కరోనా రోగులు మృత్యువాత పడ్డారు. ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా నగరంలో ఇది వెలుగు చూసింది.దీంతో ఆస్పతరి ప్రాంతం అంతా రోగుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇది జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో ఎయిర్ కండీషనర్ నుంచి ఒక్కసారిగా  మంటలు వచ్చాయి. అవి కాస్తా భవనం మొత్తం వ్యాపించడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ దాటికి రోగులకు ఊపిరి ఆడలేదు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అందరిని బయటకు పంపే ప్రయత్నాలు చేశారు. అయినా కూడా ఊపిరి ఆడక ఏడుగురు మరణించారు. నిబంధనలను గాలికి వదిలేసి భద్రతా చర్యలు తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఆస్పత్రిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులు అగ్ని ప్రమాదం రూపంలో ప్రాణాలు వదలడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.