మసీదులో రక్తపాతం.. 200 మంది బలి - MicTv.in - Telugu News
mictv telugu

మసీదులో రక్తపాతం.. 200 మంది బలి

November 24, 2017

ఉగ్రవాదానికి మతం లేదని రుజువైంది. ఈజిప్టులో శుక్రవారం ఇస్లామిక్ ఉగ్రవాదులు ఒక మసీదులో రక్తపాతం సృష్టించారు. భక్తిప్రపత్తులతో ప్రార్థన చేసుకుంటున్న భక్తులపై బాంబు పేలుళ్లు, కాల్పులతో నరమేధానానికి తెగబడ్డారు. దాడిలో 200 మందికిపైగా బలయ్యారు. మరో వంద మంది గాయపడ్డారు. సినాయ్ రాష్ట్రంలోని అల్ రాదా మసీదులో ఈ ఘాతుకం జరిగింది.ఉగ్రవాదులు మొదట బాంబు పేల్చి, తర్వాత కాల్పులకు పాల్పడ్డారు. చివరకు అంబులెన్స్ పైనా దాడి చేశారు. భక్తుల్లో కొందరు సూఫీలు ఉన్నారని, వారిని చంపడానికే దాడి చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. గతంలో ఐసిస్ ఉగ్రవాదులు ఇలాంటి దాడులు చేశారని, తాజా దాడి కూడా వారి పనేనని అనుమానిస్తున్నారు.