Egyptian singer said he will marry me : Urvashi routela
mictv telugu

ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలున్న వ్యక్తి పెళ్లి చేసుకుంటానన్నాడు

August 10, 2022

బాలీవుడ్ అందాల నటి, మోడల్ ఊర్వశి రౌతేలా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఓ సారి ఓ ఈజిప్టు సింగర్ తనను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడని, కానీ, సాంస్కృతిక వ్యత్యాసం కారణంగా నో చెప్పానని గుర్తు చేసుకుంది. అంతేకాక, అతనికి అప్పటికే ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారని అయినా తనను చేసుకోవడానికి ముందుకు వచ్చాడని తెలిపింంది. దుబాయ్ ఎయిర్ పోర్టులో కలిసినప్పుడు ఈ సంఘటన జరిగిందని వివరించింది. ఇక చిన్నా చితకా వాళ్లు చేసే ప్రపోజల్స్ పెద్దగా పట్టించుకోను కానీ, ఈజిప్టు సింగర్ అలా చెప్పడంతో షాక్ అయ్యానని పేర్కొంది. కాగా, ఆ సింగర్ పేరు ఊర్వశి వెల్లడించనప్పటికీ అతని పేరు మహ్మద్ రమదాన్ అయి ఉండవచ్చని చెప్తున్నారు. ఆయనతో కలిసి ఊర్వశి 2021లో వెర్సెస్ బేబీ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేసింది. అత్యంత ఖరీదైన వీడియో ఆల్బంగా పేరు గాంచిన ఈ వీడియోలో ఊర్వశి ధరించిన క్యాస్టూమ్స్‌కే రూ. 15 కోట్లు ఖర్చయింది. ఈ మ్యూజిక్ ఆల్బంతోటే ఊర్వశి అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసింది.