AP : గంజాయి మత్తులో యువకుడి వీరంగం... బ్లేడుతో ఎనిమిదేళ్ల చిన్నారి మెడ కోసి హల్ చల్.!! - MicTv.in - Telugu News
mictv telugu

AP : గంజాయి మత్తులో యువకుడి వీరంగం… బ్లేడుతో ఎనిమిదేళ్ల చిన్నారి మెడ కోసి హల్ చల్.!!

February 24, 2023

ఆంధ్రప్రదేశ్ లోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ విషాద ఘటన జరిగింది. గంజాయి మత్తులో ఓ యువకుడు చిన్నారిపై బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. గంజాయి తీసుకున్న మత్తులో ఏం జరుగుతుందో తెలియకుండా తనకు సంబంధం లేని చిన్నారి గొంతు కోశాడు. ఈఘటన గురువారం వెలుగు చూసింది.

పూర్తి వివరాలు చూస్తే…కావలిలోని వెంగళరావు‎నగర్ లో ఉన్న పొట్టిశ్రీరాములు పురపాలక పాఠశాలలో చిన్నారి రెండో తరగతి చదువుతుంది. గురువారం సాయంత్రం చిన్నారి పాఠశాల నుంచి ఇంటికి వస్తుంది. ఈ క్రమంలోనే అదే ప్రాంతంలో నివసించే నిందితుడు షేక్ ఖాదర్భాషా …గంజాయి మత్తులో బాలికపై బ్లేడులో దాడికి పాల్పడ్డాడు. గొంతుమీద కోయడంతో అతడి నుంచి తప్పించుకున్న బాలిక పరిగెడుతూ ఇంటికి చేరుకుంది. బాలిక వెంటె పరిగెడుతూ వచ్చిన యువకుడిని తానే గొంతు కోసినట్లు చెప్పాడు.

బాలిక ఇంటి ముందు హల్ చల్ చేశాడు. దీంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. చిన్నారిని తీసుకుని తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స అందించిన తర్వాత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.