ఇప్పటివరకూ మహారాష్ట్ర రాజకీయాలు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ నిన్న మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే రాజీనామాతో కొలిక్కి వచ్చాయి. తాజాగా కాబోయే సీఎం గురించి మరో సంచలన వార్త బయటకు వచ్చింది. ఊహించని విధంగా ఏక్నాథ్ షిండేను సీఎంగా కన్పామ్ చేశారు బీజేపీ నేత, మాజీ సీఎ: ఫడ్నవీస్. షిండే రాత్రి 7 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు ఫడ్నవీస్ అవుతారంటూ.. ఏకనాథ్ షిండే డిప్యూటీ సీఎం అవుతారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో షిండే పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది.
ఉద్ధవ్ థాక్రే రాజీనామాతో రాష్ట్రంలో సర్కారు కుప్పకూలగా.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లభించింది. ఈ నేపథ్యంలోనే శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండేతో కలిసి గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిశారు మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. సీఎం ఛాన్స్‌ను రెబల్ నేతకే అప్పగించారు.