Home > క్రీడలు > అస్స్లీ చాయ్ వాలా…..

అస్స్లీ చాయ్ వాలా…..

చాయ్ వాలా పేరు గురించి ఇండియాకు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. పోయిన సాధారణ ఎన్నికల ముందు ఎవరి ఫోన్ల చూసినా చాయ్ వాలా బొమ్మనే. ఎక్తాబిస్ మాత్రం పక్కా చాయ్ వాలా. నో డౌట్. ఈ పేరు యాన్నో విన్నట్లుంది కదా. అవును…. అదే పేరు… మొన్నటి క్రికెట్ మ్యాచ్ లో దయాది దేశం పాకిస్తాన్ అద్భతమైన బౌలింగ్ తో మట్టి కరిపించిన ఎక్తాబిస్… గురించిన ముచ్చటనే ఇది.

ఎక్తా బిస్ ది ఉత్తరఖండ్ లోని అల్మోరా. ఆమె తండ్రి కుందన్ సింగ్ బిస్తి ఆర్మీలో హవల్దార్ గా పనిచేసి ఎప్పుడో రిటైర్ అయ్యారు. కుమార్తెకు క్రికెట్ పట్ల ఉన్న మక్కువను గుర్తించి… ఆమెను ప్రోత్సహించాలని అనుకున్నాడు. అందుకే పెన్షన్ డబ్బులు చాలక పోవడంతో టీ స్టాల్ పెట్టాడు. జీవితం ఎన్ని కష్టాల పాలైనా ఫర్వాలేదు కాని తన కుమార్తె మాత్రం క్రికెట్ లో రాణించాలని అనుకున్నాడు.

తండ్రి కలలను నిజం చేస్తూ 2011లో ఎక్తాబిస్ భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించింది. మొన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మంచి ప్రతిభ చూపించి దేశం దృష్టిని తన వైపుకు తిప్పుకున్నది. కుమార్తె విజయాన్ని చూస్తున్న కుందన్ బిస్త్ ఫుల్ ఖుషీ.

ప్రచార పటాటోపాలు లేకుండానే దేశం గర్వించే స్థాయికి చేరుకున్న ఎక్తా బిస్… నెంబర్ ఏక్ క్రీడాకారిణి అనడంలో డౌటే లేదు.

Updated : 5 July 2017 1:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top