వీడియో : తుపాకులతో ఎన్నికల ప్రచారం - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : తుపాకులతో ఎన్నికల ప్రచారం

May 23, 2022

ఎన్నికల ప్రచారం అంటే కరపత్రాలు, బ్యానర్లు ఇస్తూ, మంచి ప్రసంగాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకోవడం లాంటివి ఉంటాయని మనకు తెలుసు. కానీ, జార్ఖండ్‌లో మాత్రం ఓ అభ్యర్ధి ఏకంగా తుపాకులతో ప్రచారం చేశాడు. వివరాలు.. సాహిబ్ గంజ్ జిల్లా పరిషత్ ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్ది సునీల్ యాదవ్ ఓటర్ల వద్దకు ప్రచారానికి వెళ్లారు.

వెంట వచ్చిన కొందరు అనుచరులు బహిరంగంగా ఆయుధాలు ధరించి ఆయన వెంట నడిచారు. దీంతో భయపడిపోవడం ప్రజల వంతైంది. ఈ వీడియోను ప్రత్యర్ధి అభ్యర్ధి బీజేపీకి చెందిన బాబూలాల్ మరాండీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి వైరల్ చేశారు. అంతేకాక, జిల్లా ఎస్పీకి అటాచ్ చేశారు. దీంతో స్పందించిన ఎస్పీ.. తగిన చర్యలు తీసుకున్నారు. వారి నుంచి మొత్తం ఏడు తుపాకులను స్వాధీనం చేసుకొని నియమాల ఉల్లంఘన పేరుతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 241 మందిపై వారెంట్ జారీ చేసి 58 మందిని అదుపులోకి తీసుకున్నారు.