బతుకమ్మ చీరల పంపిణీకి ఈసీ బ్రేక్ - MicTv.in - Telugu News
mictv telugu

బతుకమ్మ చీరల పంపిణీకి ఈసీ బ్రేక్

October 3, 2018

తెలంగాణ ముందస్తు ఎన్నికల వ్యవహారంలో ఎన్నికల సంఘం గందరగోళానికి గురువుతోంది. ఎన్నికలకు అంతా సిద్ధమంటూ ఒకసారి, నిర్ణయం గురించి ఇప్పుడే చెప్పలేమంటూ మరోసారి మాటలు నములుతోంది. చివరికు స్పష్టంగా తేల్చిచెప్పాల్సిన, ప్రజల జీవితాలతో ముడిపడిన విషయాల్లోనూ తికమకపడుతోంది. తెలంగాణ ఆడపడచులు సంబరంగా జరుపుకునే బతుకమ్మ పండగ విషయంలో ఈసీ ధోరణిపై విమర్శలు వస్తున్నాయి.

rr

బతుకమ్మ చీరల పంపిణీకి, రైతు బంధు చెక్కుల పంపిణీకి ఎన్నికల కోడ్ అడ్డురాదని చెప్పిన ఈసీ తాజాగా బాంబు పేల్చింది. ఈ పంపిణీ ఎన్నికల కోడ్‌కు విరుద్ధం కనుక చీరలను పంచకూడదంటూ ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కనుకు ప్రజలను ప్రభావితం చేస్తే ఏ చర్యా సరికాదని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కోటి చీరల పంపిణీ ఆగిపోనుంది. 250 కోట్లతో వీటిని తయారు చేయించారు. ఇప్పటికే 50 లక్షల చీరలు జిల్లాలకు వెళ్లాయి. చీరల పంపిణీకి బ్రేక్ వేసిన ఈసీ రైతు బంధు చెక్కుల పంపిణీపై ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారింది.