చరిత్రలో తొలిసారి.. 324ను  ప్రయోగించిన ఈసీ - MicTv.in - Telugu News
mictv telugu

చరిత్రలో తొలిసారి.. 324ను  ప్రయోగించిన ఈసీ

May 15, 2019

లోక్‌సభ చివరి విడత ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో హింస, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కోల్‌కతాలో నిన్న నిర్వహించిన ర్యాలీ బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలతో హింసాత్మకంగా మారింది. ఈ రోజు కూడా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఇరుపార్టీల కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో  ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తొలిసారి 324వ అధికరణాన్ని ప్రయోగించి, ఒక రోజు ముందుగానే ఎన్నికల ప్రచారానికి తెరదించింది.

Election commission orders end of campaigning in West Bengal from 10 pm tomorrow in the wake of violence between tmc and bjp activists  first time in the history of India invoked Article 324.

బెంగాల్లో ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం ప్రచారానికి గడువు ముగియనుండగా, ఈసీ రేపు రాత్రి 10 గంటలకే ప్రచారం ముగించాలని అభ్యర్థులను ఆదేశించింది. ప్రచారం గడువును తగ్గించడం మన దేశ ఎన్నికల చరిత్రలో ఇదే తొలిసారి అని భావిస్తున్నారు. 19న ఎన్నికలు జరిగే డమ్‌డమ్, బరాసట్, బసిర్హట్, జయనగర్, మథురాపుర్, జాదవ్ పూర్, డైమండ్ హార్బర్, దక్షిణ కోల్‌కతా, ఉత్తర కోల్‌కతాలలో రేపు రాత్రికల్లా ప్రచారాన్ని బందుపెట్టాలని ఈసీ అధికారులు స్పష్టం చేశారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని ప్రభుత్వం శిక్షిస్తుందని ఆశిస్తున్నట్లు ఓ ప్రకటలో పేర్కొంది.