ఏపీలో మరోసారి రీ-పోలింగ్! - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో మరోసారి రీ-పోలింగ్!

May 16, 2019

ఈ నెల 19న దేశంలో చివరి దశ పోలింగ్ జరుగనుంది. అలాగే ఏపీలోని కొన్ని చోట్ల మరోసారి రీ-పోలింగ్ జరగనుందని సమాచారం. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 19న రీపోలింగ్  నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. చంద్రగిరిలోని ఎన్.ఆర్. కమ్మపల్లి, కమ్మపల్లి, పులిపర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామాపురంలోని పోలింగ్ కేంద్రాల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది.

Election commission to conduct re polling in ap.