మున్సిపల్‌ ఎన్నికల్లో ఫేస్‌ రికగ్నెజ్‌ కెమెరాలు - MicTv.in - Telugu News
mictv telugu

మున్సిపల్‌ ఎన్నికల్లో ఫేస్‌ రికగ్నెజ్‌ కెమెరాలు

January 16, 2020

JKFN V

త్వరలో జరుగనున్న తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వ సిద్ధం అవుతోంది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో దొంగ ఓట్లకు చెక్‌ పెట్టేందుకు సరికొత్త పద్ధతిని ఎంచుకుంది. ఇప్పటి వరకు పోలీసులకు, విమానాశ్రయాలకు పరిమితమైన ఫేస్‌ రికగ్నెజ్‌ కెమెరాలను మున్సిపల్‌ ఎన్నికల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 

ఈ కెమెరాలను ప్రయోగాత్మకంగా ఉపయోగించి దొంగ ఓట్లను అరికట్టాలని భావిస్తుంది. ఈ పని కోసం పోలింగ్ కేంద్రాల్లో ఒక ప్రత్యేక పోలింగ్ ఆఫీసర్ అదనంగా ఉండనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌ కాస్టింగ్‌‌తో పాటు వీడియో రికార్డింగ్ చేస్తామని, వెబ్‌ కాస్టింగ్ లేని పోలింగ్ కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్లు ఉంటారని ఈసీ తెలిపింది. మున్సిపల్ ఎన్నికల కోసం 44వేల మంది ఎన్నికల సిబ్బంది, ఉద్యోగులు పోలీసులు విధుల్లో ఉంటారని, ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ హెల్ప్‌లైన్‌ కమ్‌ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసింది. ఇందుకోసం మూడు ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ నంబర్లను కేటాయించింది. ప్రజలు, రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు తమకున్న ఫిర్యాదులను 040–29802895, 040–29802897 నంబర్లకు ఫోన్‌ చేసి చెప్పవచ్చని, 040–29801522 నంబరుకు ఫ్యాక్స్‌ ద్వారా తెలియజేయవచ్చని పేర్కొంది.