ఎన్నికల గుర్తులుగా చంద్రబాబు, జగన్, పవన్ ఫోటోలు! - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నికల గుర్తులుగా చంద్రబాబు, జగన్, పవన్ ఫోటోలు!

March 14, 2019

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. ఏపీలో రాజకీయాలు చేయడానికి ఏదీ అనర్హం అన్నట్టుగా ఉంది పరిస్థితి. విపక్ష వైకాపా ఎన్నికల గుర్తు అయిన ఫ్యాన్‌ అంటేనే టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. దాన్ని చూస్తే, జనం సైకిల్‌ను మరిచిపోతారని, తాము ఓడిపోతామని బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే కుప్పంలో దీనిపై రచ్చ జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో, పోలింగ్ బూతుల్లో ఫ్యాన్లను తీసేయాలని పార్టీ శ్రేణులు ఎన్నకల అధికారులకు మొర్రపెట్టుకున్నాయి. ఫ్యాన్‌ను చూస్తే వైకాపా గుర్తుకొచ్చి ఆ పార్టీకే ఓటేస్తారని ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ఫ్యాన్‌ను తీసేయడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.

Election poll symbols controversy in Andhra Pradesh over YSRCP fan, tdp cycle and janasena glass kuppam netizens advised chandrababu, pawan kalyan and jagan mohan reddy photos as symbols.

ఫ్యాన్ మాత్రమే కాకుండా జనసేన గుర్తయిన గాజు గ్లాసుపై పచ్చపార్టీ శ్రేణులు కోపంతో ఉన్నాయి. వీలైనంత వరకు అవి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్లాస్టిక్, పేపర్ గ్లాసులపై కన్నేశాయి. టీడీపీ వాలకాన్ని గుర్తించిన వైకాపా శ్రేణులు కూడా సైకిల్‌ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యోచిస్తున్నాయి. ఫ్యానూ, సైకిల్‌ను కనుమరుగు చేయడానికి గాజు గ్లాసు యత్నిస్తోంది. ఇవన్నీ కిందస్థాయి కార్యకర్తల వ్యవహారమని, పై స్థాయి నేతలు వాటిని పట్టించుకోవడం లేదని మళ్లీ ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఏ గుర్తుకూ ఇబ్బంది రాకూడదంటే అసలు గుర్తులన్నింటినీ తీసేసి చంద్రబాబు, జగన్, పవన్‌ల ఫొటోలనే గుర్తులుగా పెట్టేస్తే సరిపోతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతకుముందే ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకునే జనం బూతుల్లోకి వస్తారని, చప్పున గుర్తులను చూసి నిర్ణయం మార్చుకోరని, మార్చుకుంటారని భావిస్తే అది అవివేకమేనని అంటున్నారు.