Election Results : BJP’s Tripura, Nagaland wins, meghalaya hung
mictv telugu

Election Results : త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ హవా..మేఘాలయాలో హంగ్

March 2, 2023

Election Results : BJP’s Tripura, Nagaland wins, meghalaya hung

ఈశాన్యంలో బీజేపీ గాలి వీచించి. ఎన్నికల ఫలితాల్లో కమలం సత్తా చాట్టింది. త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ కూటమి జయకేతన ఎగరవేసి..మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. మేఘాలయాలో మాత్రం ఎన్‌పీపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే హంగ్ ఏర్పాడ్డండో సీఎం కాన్రాడ్ సంగ్మా బీజేపీతో జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

త్రిపురలో మొత్తం 60 నియోజకవర్గాలకు బీజేపీ -ఐపీఎఫ్‌టీ కూటమి 33 స్థానాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కించుకోంది. మరో 14 చోట్ల కాంగ్రెస్-వామపక్షాలు గెలచాయి. మొదటిసారి పోటీచేసిన తిప్రా మోథా పార్టీ 13 చోట్ల జయకేతనం ఎగురవేసింది. నాగాలాండ్‌లో 60 స్థానాలకు ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి అభ్యర్థులు 38 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకున్నారు.

మేఘాలయాలో హంగ్ ఏర్పడింది. ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న సీఎం సంగ్మా పార్టీ ఎన్‌పీపీ ..మ్యాజిక్ ఫిగర్‌కు కాస్త దూరంలో నిలిచిపోయింది. ఎన్‌పీపీ‌కి 27 సీట్లు రాగా, బీజేపీ 2, టీఎంసీ 5, కాంగ్రెస్ 5, ఇతరులు 20 చోట్ల విజయం సాధించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఎన్‌పీపీ‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీతో జత కట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందే బీజేపీతో ఎన్‌పీపీ కటీఫ్ చెప్పింది. అయితే ఇప్పుడు మరోసారి ఆ పార్టీతో ముందు పోతాదో లేక కొత్త స్నేహాన్ని వెతుకుతుందో చూడాలి.