ఆపని చేయండి.. పాక్‌కు సాయం చేస్తాం.. రాజ్‌నాథ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆపని చేయండి.. పాక్‌కు సాయం చేస్తాం.. రాజ్‌నాథ్

May 14, 2019

ఉగ్రవాదాన్ని తమ దేశం నుంచి తరిమేస్తామని పాకిస్థాన్ అంటే.. అందుకు భారత్ తప్పకుండా సాయం చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు.  భారత్‌తో పాక్‌ సత్సంబంధాలు కోరుకుంటోందని భావిస్తామని వ్యాఖ్యానించారు. భారత్‌లో మరోసారి ప్రధాని మోదీ ప్రభుత్వం ఏర్పాటైతే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనే అవకాశం ఉంటుందని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఇటీవల అన్న విషయం తెలిసిందే.

Elections 2019 Imran Khan Should Ensure Terror Wiped Out Completely From Pak Rajnath Singh.

దీంతో ఇమ్రాన్, మోదీ స్నేహితుడని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ స్పందించారు. పాక్ ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామని ప్రకటిస్తే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిజంగానే మోదీ అభిమాని అని మేము విశ్వసిస్తామని స్పష్టంచేశారు.