రాష్ట్రపతి పాలన విధించాకే ఎన్నికలు : ఉత్తమ్ కుమార్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రపతి పాలన విధించాకే ఎన్నికలు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

April 18, 2022

తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ నేతలతో మీటింగు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి. ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టేలా డిమాండ్ చేయాలి. ఒకవేళ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా రాష్ట్రపతి పాలన పెట్టాకనే ఎన్నికలు జరిపేలా చూడాలని కోరాలని వ్యాఖ్యానించారు. కాగా, ఉత్తమ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆ పార్టీ శ్రేణులు ఆచితూచి స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా, కేసీఆర్, గవర్నర్‌ల మధ్య వివాదం రేగుతున్న ఈ తరుణంలో కేంద్రం రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉందని జోరుగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.