సూపర్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 452 కి.మీ - MicTv.in - Telugu News
mictv telugu

సూపర్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 452 కి.మీ

July 9, 2019

ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల హవా మొదలైనది. ఒకదాని తరువాత ఒకటి ప్రముఖ కారు తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్ల తయారీని మొదలుపెడుతున్నాయి. ఆ జాబితాలోకి తాజాగా హ్యుందాయ్ వచ్చి చేరింది. హ్యుందాయ్ కంపెనీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘కోన’ను భారత్‌లో విడుదల చేసింది. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.25.30 లక్షలుగా నిర్ణయించారు. ఇండియాలో విడుదలైన మొదటి ఎస్‌యూవీ కారు ఇదే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కోన ఎలక్ట్రిక్ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్‌లతో లభిస్తోంది. 39.2 కిలోవాట్లు, 64 కిలోవాట్లతో లభించనున్నాయి. ఈ కారుకి అమర్చిన బ్యాటరీని ఒక్కసారి ఫుల్ బ్యాటరీ చేస్తే 452 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 80శాతం ఛార్జ్ కావడానికి గంట సమయం మాత్రమే పడుతుంది. 

కారు ఫీచర్ల విషయనికస్తే.. కారు లోపల 8 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే అమర్చారు. దీనికి స్మార్ట్ ఫోన్ అనుసంధానం చేసుకోవచ్చు. అలాగే ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీని కూడా అందించారు. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, వెంటిలేటెడ్‌ సీట్స్‌, హెడ్‌అప్‌ డిస్‌ప్లే ఉన్నాయి. ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, బైఫంక్షన్‌ ఎల్‌ఈడీ ల్యాంప్‌లు, డిజిటల్‌ ఇన్‌స్ట్రమెంట్‌ కన్సోల్‌, 10రకాలుగా డ్రైవర్‌సీట్‌ను మార్చుకునే ఆప్షన్‌ను అందించారు. ఎలక్ట్రిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, ఏబీఎస్‌, ఈబీడీ, ఈఎస్‌సీ, వీఎస్‌ఎం, హెచ్‌ఏసీ, అన్ని వీల్స్ డిస్క్‌ బ్రేక్‌, వర్చువల్‌ ఇంజిన్‌ సౌండ్‌ సిస్టమ్‌ ఉన్నాయి.