ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు

March 30, 2022

ఇటీవలే తెలంగాణ విద్యుత్ ఛార్జీలను పెంచగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు వచ్చింది. కరెంటు ఛార్జీలను పెంచుతూ ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. 30 యూనిట్ల వరకు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు పెంచింది. 76 నుంచి 125 యూనిట్ల వరకు రూ. 1.40, 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ. 1.57, 226 నుంచి 400 యూనిట్ల వరకు రూ. 1.16 వరకు పెంచినట్లు తెలిపింది. 400 యూనిట్లు దాటితే యూనిట్‌కు 55 పైసలు పెంపు వర్తిస్తుందని ప్రకటించింది. కాగా, పెంచిన ధరలు ఆగస్టు నెల నుంచి అమల్లోకి రానున్నాయి.