Electric high wires accident Anantapur district
mictv telugu

అనంతపురంలో ఘోరం.. ఆరుగురు బలి

November 2, 2022

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఆరుగురి నిండుప్రాణాలను బలితీసుకుంది. ఏపీలోని అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం దర్గా హొన్నూరులో హైటెన్షన్ విద్యుత్ వైరు తెగి పడడంతో రైతు కూలీలు మృత్యువాత పడ్డారు. పొలంలో పని చేసుకోడానికి వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. వైర్ పరిస్థితి బాలేదని, ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయిందని రైతులు వాపోయారు. 200 రూపాయల కూలీ కోసం రైతులు వరిపొలంలో పనిచేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. గాలి విసురుకు రెండు వైర్లు తలగడంతో, తెగిపోయి ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. గతంలోనూ అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోనూ ఇటాంటి ఘోరాలు జరిగాయి. వైరు తెగి ఆటోపై పడ్డంతో ఐదుగురు చనిపోయారు. ఓ ఉడత కొరకంతో వైరు తెగిందని అధికారులు చేతులు దులుపుకున్నారు. ఈ ప్రమాదంపై అధికారులు ఇంతవరకు స్పందించడం లేదు.