electric highways are coming : nitin Gadkari
mictv telugu

మరో సంచలనం.. ఎలక్ట్రిక్ హైవేలు వస్తున్నాయన్న గడ్కరీ

September 12, 2022

విద్యుత్ వాహనాలను మరింత ప్రోత్సహించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి త్వరలో ఎలక్ట్రిక్ హైవేలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. సోలార్ ఎనర్జీ సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులు తిరుగుతాయని తెలిపారు. అందుకనుగుణంగా హైవేలను తీర్చి దిద్దనున్నట్టు పేర్కొన్నారు. ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన పాల్గొని ఈమేర వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం 26 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలను నిర్మిస్తున్నామని, టోల్ ప్లాజాల్లోని సోలార్ ఎనర్జీని వినియోగించేలా ప్రోత్సహించనున్నట్టు స్పష్టం చేశారు. కాగా, ఎలక్ట్రిక్ హైవేలను సులువుగా చెప్పాలంటే.. రైల్వే లైన్లను పోలి ఉంటాయి. రైళ్లు నడిచేటప్పుడు ఏ విధంగా పైనున్న విద్యుత్ లైన్ల సాయంతో పరుగులు పెడతాయో అలాగే జాతీయ రహదారులపై పయనించే వాహనాలు కూడా ఇలాగే విద్యుత్ లైన్లను వినియోగించుకుని బ్యాటరీని రీజార్జ్ చేసుకుంటాయి. కానీ, ఇక్కడ సోలార్ ఎనర్జీ అందుబాటులో ఉంటుంది. అయితే ఏ రూట్‌లో ఎలక్ట్రిక్ హైవేలు అభివృద్ధి చేయాలన్న దానిపై కసరత్తు జరుగుతోందని గడ్కరీ వివరించారు.