శీతాకాలం వచ్చిందంటే చాలు వేడిగా తినాలి, తాగాలి అనిపిస్తుంది. వేసవి కాలంలో చల్లని నీరు కోసం చూసే మనం వింటర్ లో మాత్రం వేడి నీళ్ళు తాగాలని అనుకుంటాం. అసలు ఏ కాలంలో అయినా వేడినీళ్ళు తాగితే మంచిదని అంటారు. వింటర్ వేడి నీరు తాగితే జలుబు, దగ్గుల వంటివి మన రమ్మన్నా రావు. మరి అన్ని లాభాలు ఉన్న వేడి నీరు ఎలా కాచుకుంటున్నారు? పాతకాలంలో లాగా ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నీళ్ళు వేడి చేసుకుంటున్నారా? కావల్సినప్పుడల్లా ఇలా చేయలేక ఇబ్బంది పడుతున్నారు కదూ?… ఇదిగో ఇది మీ కోసమే. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు వేడి చేసుకునే కెటిల్స్ మనకు అందుబాటులోకి వచ్చేసాయి.
కెటిల్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవేవీ కొత్తగా వచ్చినవి కావు. కానీ కాస్టలీగా ఉండేవి. అయితే ఇప్పుడు ఇవి అందరికీ అందుబాటులోకి వచ్చేసాయి. మార్కెట్లోకి తక్కువ ధరకే రకరకాల కెటిల్స్ దొరుకుతున్నాయి. వీటిల్లో నీళ్ళు వేడి చేసుకోవడమే కాదు టీ, కాఫీల్లాంటివి కూడా పెట్టేసుకోవచ్చు. అంతే కాదండోయ్ ఇన్సస్టంట్ నూడిల్స్, ఓట్స్ లాంటివి కూడా ఇట్టే తయారు చేసేసుకోవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ కెటిల్స్కి మంచి రివ్యూస్ కూడా వస్తున్నాయి. ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి అంటున్నారు వినియోగదారులు. ఇవి రకరకాల సైజులలో కూడా లభిస్తున్నాయి.డబుల్ వాల్ కలిగిన కూల్ టచ్ కెటిల్స్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి.వీటన్నింటిలో పవర్ఫుల్ హీటింగ్ ఎలిమెంట్ అందుబాటులో ఉంది.
VandelaY ఎలక్ట్రిక్ కెటిల్:
అన్నింటిలోకి దీనికి యూజర్స్ ఎక్కువగా ఉన్నారు. 4.5 రేటింగ్ తో ఇది టాప్ ప్లేస్ లో ఉంది. నీళ్ళు చాలా తొందరగా వేడి ఎక్కడమే కాకుండా ఎక్కువసేపు నీరు వేడిగా ఉంటుంది. లోపలి నీరు వేడిగా ఉన్నా పైగా బాడీ మాత్రం చల్లగానే ఉండి చేతులు కాలకుండా ఉంటుంది.ఆటో కటాఫ్ ఫీచర్ దీని ప్రత్యేకత.
Pigeon Amaze Plus కెటిల్:
1.5 లీటర్ల ఈ స్టీల్ కెటిల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దీంట్లో నీళ్ళు, టీ, కాఫీ, నూడిల్స్ అన్నీ చేసుకోవచ్చు. గుడ్లను కూడా ఉడకబెట్టుకోవచ్చు అంటున్నారు తయారీదారులు.
prestige కెటిల్:
1500 వాట్స్ పవర్‌తో పనిచేసే ఈ కెటిల్ రెడ్ కలర్లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోయే ప్రాడెక్ట్‌గా దీనికి పేరు ఉంది. ఇది 1.5 లీటర్ల సైజులో లభిస్తుంది. దీనికి వన్ ఇయర్ వారెంటీ కూడా ఇస్తున్నారు.
Havells Aqua Plus 1.2 litre Double Wall కెటిల్:
1.2 లీటర్ల సైజులో ఉండే ఈ కెటిల్ ఆకర్షణీయమైన షేప్‌లో ఉంటుంది. దీని నోరు వెడల్పుగా ఉండడం వలన సులభంగా నీటిని నింపుకోవచ్చు. 2 యేళ్ళ వారంటీతో ఇది లభిస్తుంది. పూర్తిగా డబుల్ వాల్ కలిగిన కూల్ టచ్ బాడీ ఎలక్ట్రిక్ కెటిల్ ఇది.
AmazonBasics Double-Walled Stainless Steel Electric కెటిల్:
200 వాట్స్ పవర్‌తో పనిచేసే ఈ కెటిల్ సూపర్ హీటింగ్ ఎలిమెంట్ కలిగి ఉంటుంది. దీనిని 16 ఎంపియర్ సాకెట్‌కు కనెక్ట్ చేసుకొని ఉపయోగించుకోవాలి. స్టీమ్ సెన్సార్స్ సహాయంతో ఇది పనిచేస్తుంది. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ కెటిల్స్. తక్కువ ధరకే సామాన్యుడు కూడా కొనుక్కునే రేంజ్ లో ఇవి దొరుకుతున్నాయి.