Electric scooter owner fined for driving without pollution certificate in Kerala, challan receipt goes viral
mictv telugu

పోలీస్ బుద్ధి.. అది లేదని ఎలక్ట్రిక్ బైకర్‌కు జరిమానా

September 9, 2022

కాలుష్య రహిత వాతావరణం కోసం ఆయా ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. తద్వారా పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గి.. తద్వారా పెద్ద మొత్తంలో కాలుష్యాన్ని కట్టడి చేయవచ్చని భావించి.. ఆ వైపుగా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని సదరు యజమానికి ఓ ట్రాఫిక్ పోలీస్ ఫైన్ వేశాడు. ఆ చలానాకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. అధికారుల పని తీరు చూసి నవ్వుకుంటున్నారు. గతంలో విమర్శలు వచ్చినా అధికారుల తీరు మారలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

కేరళలోని మలప్పురం జిల్లాలో ఓ ట్రాఫిక్ పోలీస్ అధికారి ద్విచక్ర వాహనదారుడికి షాకిచ్చాడు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేదనే కారణంతో ఎలక్ట్రిక్ స్కూటీ యజమానికి రూ.250 Fine వేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన చలానా ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో కూడా పోలీసులు ఇదే తరహాలో బుల్లెట్ బండిలో సరిపడా పెట్రోల్ లేదనే కారణంతో రూ.250 ఫైన్ వేశారు. అప్పట్లో ఈ వార్త హాట్ టాపిక్ కూడా అయింది.