వీడియో : బస్సుపై ఏనుగు దాడి.. తెలివిగా తప్పించిన డ్రైవర్ - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : బస్సుపై ఏనుగు దాడి.. తెలివిగా తప్పించిన డ్రైవర్

April 7, 2022

bfbfb

ప్రయాణీకులతో కూడిన బస్సుపై అడవి ఏనుగు దాడికి యత్నించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కేరళలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్టీసీకి చెందిన బస్సు 50 మంది ప్రయాణీకులతో మున్నార్ నుంచి ఉడుమల్‌పేటకు వెళ్తోంది. ఈ క్రమంలో అడవి నుంచి ప్రయాణిస్తుండగా.. ఓ చోట అడవి ఏనుగు రోడ్డు మీద తారసపడింది. దాంతో డ్రైవరు బస్సును ఆపివేశాడు. ఎలాంటి అరుపులు, కేకలు వేయకుండా, నిశ్శబ్దంగా ఉండాలని ప్రయాణీకులను హెచ్చరించాడు. కొద్ది సేపు బస్సును అలానే చూసిన ఏనుగు ఒక్కసారిగా బస్సు వైపు దూసుకొచ్చింది. అయినా డ్రైవరు ఎలాంటి భయాందోళనకు గురి కాలేదు. మౌనంగా ఉంటూ ఏనుగునే చూస్తున్నారు. ఏనుగు బస్సును కాసేపు తడిమి వెళ్లిపోయింది. ఏనుగు దంతాల వల్ల ముందరి అద్దంలో కొంత పగులొచ్చింది. మొత్తం ఘటనను ప్రయాణీకుల్లో ఒకరు వీడియో తీసి వైరల్ చేశారు. ఎవ్వరికీ ఎలాంటి హాని చేయకుండా ఏనుగు వెళ్లిపోవడానికి డ్రైవరు చాకచక్యమే కారణమని అందరూ ఆయనను ప్రశంసిస్తున్నారు.