వావ్, సూపర్ టేస్ట్.. ఏనుగమ్మ వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

వావ్, సూపర్ టేస్ట్.. ఏనుగమ్మ వీడియో వైరల్

June 11, 2022

కష్టసుఖాలు ఏ జీవికైనా సహజమే. మనం బాధ కలిగితే మూలుగుతాం. సంతోష సమయాల్లో ఎగిరి గంతేస్తాం. హ్యాపీ హ్యాపీ అని, కంగ్రాట్స్ అని, థ్యాంక్స్ అని ఏవేవో చెప్పుకుంటాం. మూగ జీవాలు కూడా చెప్పుకుంటాయి. అరుపులతో, శరీర కదలికలతో భావాలను చక్కగా తెలుపుకుంటాయి. తన పుట్టిన రోజున నానా రకాల పళ్లతో విందు చేసిన మనుషులకు ఓ ఏనుగు ‘వావ్, సూపర్.. థ్యాంక్యూ హ్యూమన్స్’ అంటూ సంతోషం చాటుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తొండాన్ని మాటిమాటికీ సంబరంగా ఊపుతూ, పళ్లు ఆరగిస్తూ గజరాణి అందర్నీ ఆకట్టుకుంటోంది. పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమిళనాడులోని తిరువానైకవల్ గుడికి చెందిన అఖిల అనే ఏనుగుకు జరిపిన బర్త్ డే ఫంక్షన్ వీడియో ఇది. కేకులు, డ్రింక్స్ వంటివి కాకుండా పళ్లతో వేడుక చేయడం బావుందని మహీంద్ర అన్నారు.