ఫారెస్ట్ ఆఫీసర్‌ను పొడిచి చంపిన ఏనుగు  - MicTv.in - Telugu News
mictv telugu

ఫారెస్ట్ ఆఫీసర్‌ను పొడిచి చంపిన ఏనుగు 

August 15, 2020

Elephant Forest Official In Madhya Pradesh

ఫారెస్ట్ అధికారిని ఓ ఏనుగు తన దంతంతో పొడిచి చంపేసింది. మధ్యప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ట్రాకింగ్‌ ఆపరేషన్‌లో భాగంగా విధుల్లో ఉన్న భగత్‌పై ఈ దాడి జరిగింది. దీంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రెండు పులల మధ్య కొట్లాట జరగడంతో దాన్ని పరిశీలించేందుకు వెళ్లినప్పుడు చోటు చేసుకుంది. ఈ సంఘటన తోటి సిబ్బందిలో విషాదాన్ని నింపింది. 

పన్నా అడవిలో ఇటీవల రెండు పులులు పోట్లాడుకున్నాయి. అందులో ఓ పులి మరణించింది. ఈ విషయం తెలియడంతో దానిపై ఆరా తీసేందుకు అడవిలోకి భగత్‌ వెళ్లాడు. అతన్ని చూసిన రామ్ బహదూర్‌ అనే ఓ ఏనుగు వెనక నుంచి వెంబడించి దాడి చేసింది. తన దంతంతో పొడవడంతో తీవ్ర రక్తస్రావంతో చనిపోయాడు.