Elephant got angry and threw the bike in the air like a football
mictv telugu

గజరాజుకి కోపమొచ్చింది.. బైక్‌ను గాల్లోకి ఎగరేసింది..

November 11, 2022

సర్కస్‌లో ఏనుగులు బైక్‌పై వెళ్లడం, బంతులతో ఆడుకోవడం, కొన్నిసార్లు సైకిల్‌ తొక్కడం వంటి వాటిని చూసి చప్పట్లు కొడుతూ ఆనందించే ఉంటారు. కానీ అవి బయట కూడా అలా చేయడం ప్రారంభిస్తే భయపడి పోతారు. అలాంటి ఘటన ఒకటి జార్ఖండ్ రాజధాని రాంచీ జిల్లా పరిధిలోని తమద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ ఏనుగు ప్రతాపాన్ని చూసి, అక్కడున్న జనం భయపడి, పరుగెత్తడం ప్రారంభించారు.

 

అడవిలో నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు ఒకటి కుద్బహత్ గ్రామంలోకి ప్రవేశించి గ్రామస్థులను హడలెత్తించింది. దీంతో వారు ఆ ఏనుగును తరిమికొట్టే ప్రయత్నం చేశారు. వెంటనే ఆగ్రహానికి గురైన ఏనుగు అక్కడ టీ స్టాల్ పక్కన ఆపి ఉంచిన బజాజ్ ప్లాటినా బైక్‌ను తొండంతో లేపి గాల్లోకి విసిరికొట్టింది. ఫుట్‌బాల్ ని త్రో వేసినట్లుగా ఎగరేసింది. సదరు బైకర్ అప్పుడే తన సామాన్లు అమ్ముకొని ఇంటికి వెళుతూ.. టీ తాగుదామని అక్కడున్న టీ స్టాల్ దగ్గర ఆగాడట. ఇంతలోనే ఆ ఏనుగు ఈ నిర్వాకం చేసింది. చుట్టూ వేసిన పంటను కూడా తొక్కి రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. ఏనుగు వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు, ఆ బైకర్ అటవీశాఖ అధికారులను డిమాండ్‌ చేశారు.