పేరెంటింగ్ అంటే ఇదే.. గున్న ఏనుగును అడ్డుకున్న తల్లి ఏనుగు
చిన్నతనంలో పిల్లల్ని వారి తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అనుక్షణం వారి క్షేమానికి ప్రాధాన్యతనిస్తూ.. ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహిస్తారు. మనుషులే కాదు.. మూగజీవాలు కూడా వాటి పిల్లల మీద ఉన్న లవ్ అండ్ కేరింగ్‌తో ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. ఇందులో ఒక సఫారీ పార్కులో ఏనుగు, దాని పిల్ల రోడ్డు దాటుతున్నాయి. అదే సమయంలో కొందరు టూరిస్టులు ఆ మార్గంలో వస్తారు. పిల్ల ఏనుగు వారిని చూస్తుంది. ఉత్సాహంతో పర్యాటకుల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన తల్లి వెంటనే ‘ఎక్కడికి వెళ్తున్నావ్’ అని చెబుతున్నట్లు, పిల్ల ఏనుగును అడ్డుకుంటుంది. తొండంతో గున్న ఏనుగును వెనక్కు మళ్లించి, దగ్గరకు రావొద్దన్నట్లు టూరిస్టుల వైపు చూసి, పిల్లను వెంటపెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.
Mother elephant stops its child from approaching the tourists.. pic.twitter.com/ASruHsJKnn
— Buitengebieden (@buitengebieden) September 3, 2022
ట్విట్టర్‌లో ఓ యూజర్ ఈ వీడియోను షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఇది ఎక్కడ జరిగింది అనేది తెలియదు కానీ ఇప్పటివరకు ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. లక్షలాది లైకులు, కామెంట్లు వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ ఏనుగు తల్లి ప్రేమకు ముచ్చటపడిపోతున్నారు. పేరెంటింగ్ అంటే ఇదేనంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.